మీరట్కు చెందిన సౌరబ్ రాజ్పుత్ హత్య కేసులో నిందితులైన అతడి భార్య, ఆమె ప్రియుడికి జిల్లా కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఇద్దరూ కలిసి ఘాతుకానికి ఒడిగట్టారు. భార్య ముస్కాన్ రస్తోగి, ప్రియుడు సాహిల్ శుక్లాలకు శిక్ష ఖరారు చేస్తూ.. న్యాయమూర్తి భగవద్గీతను ఉటంకించారు. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలని ఇదే ధర్మమని ఆయన వ్యాఖ్యానించినట్టు సౌరభ్ తరఫున లాయర్ మీడియాతో అన్నారు.


