భారతీయ రైల్వేలో కొలువు సాధించాలనుకునే నిరుద్యోగ యువతకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో మొత్తం 1,688 పోస్టుల భర్తీ కోసం ఆర్ఆర్బీ అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. అక్టోబర్ 15వ తేదీ అంటే ఈరోజు నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 13వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


