వ్యవసాయంలో అనుసరిస్తున్న వినూత్న పద్ధతులతో జగిత్యాల జిల్లాకు చెందిన బండారి విజయ జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. తక్కువ విస్తీర్ణంలో 14 రకాల కూరగాయలను సాగు చేయడంతో పాటు.. ఎనిమిది ఎకరాల్లో కూరగాయలు, పండ్లు, పూల పంటలను పండిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం, అంతర పంటల ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతూ ఆమె సాగులో సరికొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. హైదరాబాద్లోని బిగ్బాస్కెట్, రిలయన్స్, మోర్ వంటి సంస్థలకు నేరుగా పంటలను విక్రయిస్తున్నారు. మార్కెటింగ్ కోసం సోషల్ మీడియా వినియోగిస్తున్నారు. మహిళా రైతుల కృషిని గుర్తించే మహిళా కిసాన్ దివస్ అవార్డుకు ఆమె ఎంపిక కావడం గ్రామీణ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడంలో కీలక పరిణామంగా నిలిచింది.


