ప్రయాణికులతో ఫ్రాంక్ఫర్ట్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో హైజాక్ ముప్పు అలర్ట్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో విమానాన్ని జైపూర్కు అత్యవసరంగా మళ్లించి, అక్కడ సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం తనిఖీలు క్షుణ్ణంగా నిర్వహించిన అధికారులు.. ప్రయాణికులను కిందకు దింపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. ఏదైనా సాంకేతికలోపమా? లేదా ఏదైనా ప్రమాదం ఎదురయ్యిందా? అనేది స్పష్టత రాలేదు. ప్రస్తుతం జైపూర్ విమానాశ్రయంలో ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు.


