ఏషియన్ గేమ్స్ 2026 రెండో సెమీఫైనల్‌లో భారత మహిళల జట్టు బ్యాటింగ్‌లో సత్తాచాటింది. ఓపెనర్ షెఫాలీ వర్మ కేవలం 49 బంతుల్లో 9 సిక్సర్లతో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, స్మృతి మంధాన (37), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (40) అద్భుతంగా రాణించారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 195/4 పరుగుల భారీ స్కోరు సాధించింది. బంగ్లాదేశ్‌కు 196 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు అర్హత సాధిస్తుంది.


