HomeEntertainment4,410 వజ్రాలు.. 1,000 గంటల శ్రమ: విక్టోరియాస్ సీక్రెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఫాంటసీ బ్రా

4,410 వజ్రాలు.. 1,000 గంటల శ్రమ: విక్టోరియాస్ సీక్రెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఫాంటసీ బ్రా

ప్రముఖ రియాలిటీ స్టార్, వ్యాపారవేత్త కైలీ జెన్నర్ విక్టోరియాస్ సీక్రెట్ ఫ్యాషన్ షోలో తొలిసారి ర్యాంప్ వాక్ చేసి సంచలనం సృష్టించారు. దాదాపు 50 మిలియన్ డాలర్ల (సుమారు రూ.474 కోట్లు) విలువైన ‘ఫాంటసీ బ్రా’ ధరించి ఆమె రన్‌వేపై మెరిశారు. ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ జాకబ్ అరబో రూపొందించిన ఈ బ్రాలో 4,410 సహజ వజ్రాలతో పాటు మధ్యలో 75.54 క్యారెట్ల అరుదైన పసుపు వజ్రాన్ని పొదిగారు. దీని బరువు 1.8 కిలోలు. అయితే, ఎనిమిదేళ్ల తర్వాత తిరిగొచ్చిన ఈ ప్రఖ్యాత ఆభరణాన్ని ధరించేందుకు అసలైన మోడళ్లను కాదని కైలీని ఎంపిక చేయడంపై నెట్టింట ప్రశంసలతో పాటు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments