మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, దర్శకుడు పవన్ సాధినేని కాంబినేషన్లో వస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ విడుదలకు ముందే భారీ టేబుల్ ప్రాఫిట్ సాధించింది. ప్రచార చిత్రాలు రాకముందే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలోనే దాదాపు రూ.60 కోట్ల నిర్మాణ వ్యయం మొత్తం రికవరీ అయిపోయినట్లు సమాచారం. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాత్విక, శ్రుతి హాసన్ నటిస్తున్నారు. పల్లెటూరి యువతి అంతరిక్ష కలల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.
రిలీజ్‌కు ముందే జాక్‌పాట్.. ఓటీటీ డీల్‌తో సేఫ్ జోన్లోకి దుల్కర్ ‘ఆకాశంలో ఒక తార’!
RELATED ARTICLES


