దివ్యాంగులకు కేంద్రం అందజేసే ఆర్థిక సహాయం సామాజిక సహాయత యోజన పథకం మరో ఐదేళ్లు పొడిగించారు. బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయిం తీసుకున్నారు. అంతేకాదు, 18 ఏళ్ల అర్హత నిబంధన కూడా తొలగించారు. పుట్టినప్పటి నుంచే వైకల్యం 40 శాతం ఉంటే.. పెన్షన్ను అందజేయనున్నారు. అలాగే, పెన్షన్ డబ్బులను కూడా పెంచారు. ఈ పథకం కోసం ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ. 53,428 కోట్లు ఖర్చు చేయనుంది.


