జపాన్‌తో సానో వేదికగా జరిగిన 5 ఓవర్ల మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో నెగ్గి అరుదైన ప్రపంచ రికార్డు సాధించింది. తుఫాను, వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం కావడంతో 5 ఓవర్లకు కుదించగా, భారత్ మొదట బ్యాటింగ్ చేసి 32 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం జపాన్ను 30 పరుగులకే కట్టడి చేసింది. టీ20ఐలలో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఇంత తక్కువ స్కోరుతో మ్యాచ్ గెలిచిన తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.
సెప్టెంబర్ 22న సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్, జపాన్ జట్ల మధ్య అంతర్జాతీయ క్రికెట్లో తొలి మ్యాచ్ జరిగింది. అయితే క్రికెట్లో పసికూన జట్టుగా ఉన్న జపాన్.. టీ20 ఛాంపియన్ భారత్‌ను వణికించింది. దాదాపు ఓడించినంత పనిచేసింది. టీమిండియా 2 పరుగుల తేడాతో ఈ మ్యాచులో గట్టెక్కింది. అయినప్పటికీ ఈ మ్యాచు ద్వారా భారత క్రికెట్ జట్టు ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. పురుషుల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అతితక్కువ పరుగులను డిఫెండ్ చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది.
వర్షం కారణంగా ఈ మ్యాచును 5 ఓవర్లకు కుదించారు. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 5 ఓవర్లలో కేవలం 32/4 మాత్రమే చేసింది. అయితే చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచులో భారత్.. గెలుపొందింది. 33 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ను భారత బౌలర్లు నిలువరించారు. చివరికి జపాన్ 5 ఓవర్లలో 30 పరుగుల వద్దే నిలిచిపోవడంతో భారత్ 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది.
ఈ అద్భుత విజయంతో అంతర్జాతీయ పురుషుల టీ20 చరిత్రలోనే మొదట బ్యాటింగ్ చేసి అత్యంత తక్కువ స్కోరు సాధించినప్పటికీ మ్యాచ్ గెలిచిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. గతంలో ఐర్లాండ్ జట్టు 2008లో బర్ముడాపై 43 పరుగులు (9 ఓవర్ల ఆట) చేసి 4 పరుగుల తేడాతో నెగ్గడమే అప్పటివరకు రికార్డుగా ఉండేది. ఆ 18 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డును భారత్ ఇప్పుడు 32 పరుగులతో చెరిపేసింది.


