ఆరోగ్యం గురించి ఆలోచనలు రాగానే చాలా మంది వర్కౌట్ చేయాలంటారు. వర్కౌట్ చేయలేని వారు కనీసం నడవాలని కూడా సూచిస్తారు. ఆ నడకలో కూడా రకాలు ఉంటాయి. స్పీడ్‌గా నడిస్తే కొన్ని లాభాలు ఉంటాయని చెబుతుంటారు. దానిని బ్రిస్క్ వాక్ అని చెబుతారు. రోజులో 10 వేల అడుగులే లక్ష్యంగా పెట్టుకుని నడిస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెబుతుండగా, తాజాగా BMJ అధ్యయనం అరగంటపాటు బ్రిస్క్ వాక్ చేయడం అనేది 7500 అడుగులు వేయడానికి సమానమని చెబుతోంది. దీని గురించి వివరణ అడగ్గా డాక్టర్ షెరిన్ జార్జ్(ఫిజియోథెరపీ గ్రూప్ హెడ్, స్పర్శ్ హాస్పిటల్, ఇన్ఫంట్రీ రోడ్) కొన్ని ముఖ్య విషయాలని షేర్ చేశారు.


