HomeTELANGANA22ఏ సమస్యల పరిష్కారంలో కీలక ముందడుగు.. జీవో 59 బాధితులకు ఊరట.. నెలరోజుల్లో పరిష్కారం

22ఏ సమస్యల పరిష్కారంలో కీలక ముందడుగు.. జీవో 59 బాధితులకు ఊరట.. నెలరోజుల్లో పరిష్కారం

భూ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా జీవో 59 దరఖాస్తులపై కీలక నిర్ణయం వెలువడింది. 500 చదరపు గజాల లోపు విస్తీర్ణానికి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను నెల రోజుల్లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. భూ రికార్డులు, లబ్ధిదారుల అర్హత, స్థల విస్తీర్ణాన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో అక్రమాలు జరిగిన కేసులతో పాటు ఇప్పటికే కన్వేయన్స్ డీడ్స్ జారీ అయిన వ్యవహారాలను కూడా సమీక్షించనున్నారు. మరోవైపు.. సెక్షన్ 22-ఎ పరిధిలోని రిజిస్ట్రేషన్ సమస్యలు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తులు, నాలా ప్రక్రియకు సంబంధించిన చిక్కుల పరిష్కారంపైనా రెవెన్యూ శాఖ చర్యలు కొనసాగిస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments