మీకు దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో సంపద కావాలంటే ఏం చేస్తారు. సంపాదించిన దాంట్లో నుంచి పొదుపు చేసి పెట్టుబడులు చేస్తున్నారా? ఇదే ముఖ్యం మరి. భవిష్యత్తు కోసం సంపదను సృష్టించుకోవాలంటే మ్యూచువల్ ఫండ్లలో సిప్ చేయడం ఉత్తమం అని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. కాంపౌండింగ్ ప్రభావంతో ఇక్కడ లాంగ్ రన్లో పెద్ద మొత్తంలో సంపదను నిర్మించుకోవచ్చు. ఇక్కడ మీకు 15x15x30 రూల్ ఈ విషయాన్ని సులభంగా వివరిస్తుంది.


