
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను విస్తరించేందుకు సినీనటి మంచు లక్ష్మి నేతృత్వంలోని టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ కృషి చేస్తోంది. ఈ సంస్థ ఉమ్మడి మెదక్ జిల్లాలో 48 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని.. విద్యార్థులకు మెరుగైన బోధనా వాతావరణం కల్పించే కార్యక్రమాలు చేపట్టింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 364కి పైగా పాఠశాలలను ఆధునీకరించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ పరికరాలతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్, ఫోనిక్స్, రీడింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై దృష్టి పెట్టనున్నారు.


