హైదరాబాద్‌లోని ఫాక్స్ సాగర్ చెరువు పరిరక్షణ కోసం హైడ్రా ఆక్రమణల తొలగింపు చేపట్టింది. దూలపల్లిలోని మాజీమంత్రి మల్లారెడ్డి కుటుంబానికి సంబంధించిన ఫామ్‌హౌస్ ప్రహరీ గోడ, గేటును అధికారులు తొలగించారు. సుమారు 15 ఎకరాల ఎఫ్టీఎల్ భూమి ఫామ్‌హౌస్ సరిహద్దుల్లోకి వచ్చినట్లు గుర్తించారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అర కిలోమీటరు బండ్, ఇనుప కంచెలపైనా చర్యలు తీసుకున్నారు. జీడిమెట్లలోని సర్వే నంబర్లు 41, 42లో మరో 20 ఎకరాల పరిధిలో ఉన్న ప్రహరీ గోడను తొలగించారు.


