వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. కివీస్ నిర్దేశించిన 199 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 13.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 35 బంతుల్లోనే శతకం బాది, రికార్డు సృష్టించాడు. యంగ్ సెన్సేషన్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (46) కూడా సత్తాచాటాడు.


