నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత టీ20 జట్టులోకి పునరాగమనం చేసిన 36 ఏళ్ల స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్కు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మద్దతుగా నిలిచాడు. న్యూజిలాండ్తో జరిగిన తొలి రెండు టీ20లలో భువీ ఏకంగా 99 పరుగులు (12.37 ఎకానమీ) సమర్పించుకుని ఒకే వికెట్ తీశాడు. అయితే, అతడి వద్ద అవసరమైన నైపుణ్యం, అనుభవం ఉన్నాయని, బయటి ఒత్తిళ్లను పట్టించుకోకుండా తన సహజ సిద్ధమైన ఆటపై దృష్టి పెట్టాలని మోర్కెల్ సూచించాడు.


