HomeAndhra Pradeshహోంవర్క్ చేయలేదని టీచర్ మందలింపు.. మనస్తాపంతో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

హోంవర్క్ చేయలేదని టీచర్ మందలింపు.. మనస్తాపంతో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

హోంవర్క్ చేయలేదని టీచర్ మందలింపు.. మనస్తాపంతో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

సిద్దిపేట:
సిద్దిపేట జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వర్గల్ మండల కేంద్రంలోని బీసీ గురుకుల వసతి గృహంలో ఉంటూ పదో తరగతి చదువుతున్న రామ్ చరణ్ (15) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.మార్కుక్ మండలం పోతూర్ గ్రామానికి చెందిన రామ్ చరణ్ హోంవర్క్ చేయలేదనే కారణంతో టీచర్ కొట్టాడని, ఇక హాస్టల్లో ఉండలేనని తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం.ఈ క్రమంలో హాస్టల్లో ఎవరూ లేని సమయంలో రామ్ చరణ్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన సిబ్బంది వెంటనే బాలుడి మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.చిన్నారి వయసులోనే నిండు జీవితం ముగియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments