HomeTELANGANAహైదరాబాద్‌లో అవినీతి అధికారిణి.. రూ.4 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్

హైదరాబాద్‌లో అవినీతి అధికారిణి.. రూ.4 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్

హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ దాడులు కొనసాగుతున్నాయి. మెహదీపట్నం జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో రూ.4 లక్షల లంచం తీసుకున్న టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సునీతను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భవన నిర్మాణ అనుమతులు, క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరో ఘటనలో రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రి ప్రారంభానికి అనుమతి విషయంలో లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments