తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే నెలల్లో కరువు పరిస్థితులు తీవ్రం కావచ్చని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని.. తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చని తెలిపారు. రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని పంటలు సాగు చేయాలని, తక్కువ నీటితో పండే పంటల వైపు మళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత హరీష్‌రావును ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. విద్యుత్ పొదుపు, పశుసంపద సంరక్షణ, గ్రామాల్లో ఉపాధి కల్పనపై కూడా సీఎం ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.


