వెస్టిండీస్‌పై భారత దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. విరాట్ కోహ్లీ 41 ఇన్నింగ్స్‌ల్లో 66.50 సగటు, 96.95 స్ట్రైక్ రేట్‌తో 2,261 పరుగులు చేయగా, అందులో 9 సెంచరీలు ఉన్నాయి. మరోవైపు రోహిత్ శర్మ 35 ఇన్నింగ్స్‌ల్లో 57.60 సగటుతో 1,613 పరుగులు సాధించాడు. 162 పరుగుల అత్యధిక స్కోరుతో విండీస్ బౌలర్లపై హిట్ మ్యాన్, కింగ్ కోహ్లీ ఇద్దరూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఈనెల 27 నుంచి భారత్, విండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.


