HomeNation and Worldవివాహేతర సంబంధం విషాదం.. ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య

వివాహేతర సంబంధం విషాదం.. ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య

వివాహేతర సంబంధం విషాదం.. ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య

మండ్య తాలూకా ఇండువాల్ సమీపంలో విషాద ఘటన.. ఇద్దరు చిన్నారులు అనాథలు

కర్ణాటకలోని మండ్య తాలూకా ఇండువాల్ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహిత, ఆమె ప్రియుడు మృతి చెందిన స్థితిలో కనిపించారు.మృతురాలు కర్ణాటక మండ్య తాలూకా గున్నైకనహళ్లి గ్రామానికి చెందిన సహాన (27) గా గుర్తించారు. ఆమె బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండేది. బెంగళూరులో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న వీరేశ్‌తో ప్రేమ వివాహం చేసుకుంది. దంపతులకు 5 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమారుడు ఉన్నారు.తర్వాత రాపిడో డ్రైవర్ రాహుల్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసిందని తెలుస్తోంది. ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని సమాచారం.ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున మండ్యకు చేరిన సహాన, రాహుల్ ఇండువాల్ సమీపంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసులు మృతదేహాలను పరిశీలించి మిమ్స్ మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడి కారణంగా తీసుకునే ఇలాంటి నిర్ణయాలు ఇద్దరు చిన్నారుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments