
న్యూఢిల్లీ:
హిందూ మహాసముద్రంలో నౌకాదళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 9 కొత్త జలాంతర్గాములను నిర్మించేందుకు ప్రతిపాదనల ప్రక్రియ పూర్తి చేసింది. దీని కోసం మొత్తం రూ.1.11 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు.ఇందులో భాగంగా రూ.75 వేల కోట్లతో ప్రాజెక్ట్-75(I) అమలు చేయనున్నారు. జర్మనీకి చెందిన టీకేఎంఎస్ సంస్థతో కలిసి మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ దేశంలోనే 6 ఆధునిక జలాంతర్గాములను తయారు చేయనుంది.అదే విధంగా మరో రూ.36 వేల కోట్లతో 3 స్కార్పీన్ తరహా జలాంతర్గాములను కూడా నిర్మించనున్నారు. వీటిని కూడా మజగావ్ డాక్ లోనే తయారు చేయనున్నారు.చైనా, పాకిస్తాన్ నుంచి ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొచ్చిలో సీటెక్ సోనార్ టెస్టింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.
#National #IndianNavy #Submarines #Project75I #MDL #Defence #SEATEC


