Income Tax Penalty: పరిమితికి మించి ఆదాయం వచ్చినప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి. ప్రతి ఏటా ఐటీ రిటర్నులు ఫైల్ చేసి తమ ఆదాయ, వ్యయ, ట్యాక్స్ వివరాలను వెల్లడించాలి. అయితే, చాలా మంది ఆదాయాన్ని దాటి పెట్టి ట్యాక్స్ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఐటీ శాఖ తనిఖీలు చేసినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు, ఆస్తులు లభించినప్పుడు ఐటీ రిటర్నుల్లో చూపించలేదని తేలడం, లెక్క చూపని ఆదాయంగా భావిస్తే ఇకపై 99 శాతం మేర పెనాల్టీ పడవచ్చు. ఈ అంశంపై సీఏ దుర్గ అంజలీ వీడియో ద్వారా వివరించారు.


