HomeAndhra Pradeshబధిర విద్యార్థులకు డిగ్రీ కోర్సులు ప్రారంభం.. తొలి ఏడాది 30 సీట్లతో బీకాం కంప్యూటర్స్

బధిర విద్యార్థులకు డిగ్రీ కోర్సులు ప్రారంభం.. తొలి ఏడాది 30 సీట్లతో బీకాం కంప్యూటర్స్

బధిర విద్యార్థుల కోసం ప్రభుత్వం తొలిసారిగా ప్రారంభించిన డిగ్రీ కళాశాలలో కోర్సులకు ఆహ్వానం పలికింది. బీకాం కంప్యూటర్ సైన్స్‌లో 30 సీట్లతో ప్రవేశాలకు శ్రీకారం చుట్టారు. ఈ అవకాశాన్ని బధిర విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల జిల్లా వెదుళ్లపల్లి బధిరుల కళాశాల ప్రిన్సిపల్ కోరారు. ర్హులు సంబంధిత సర్టిఫికెట్లతో కాలేజీ దగ్గరకు వచ్చి అడ్మిషన్స్ పొందాలని సూచించారు. సందేహాలు ఉంటే 9000013633 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కూడా ఉంటుందని తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments