P Gannavaram Tdp In Charge Moka Anand Sagar: టీడీపీ అధిష్టానం పెండింగ్ ఉన్న నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమిస్తోంది. తాజాగా కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్‌ను నియమించింది. మోకా ఆనంద్ సాగర్‌కు పి గన్నవరం బాధ్యతల్ని అప్పగించింది. 2024 ఎన్నికల తర్వాత నుంచి ఈ నియోజకవర్గానికి టీడీపీ ఇంఛార్జ్‌ను నియమించలేదు. కొన్ని నెలలుగా కసరత్తు చేసిన అధిష్టానం ఎట్టకేలకు ఇంఛార్జ్‌ను నియమించింది. ప్రస్తుతం పి గన్నవరం నుంచి జనసేన పార్టీ నుంచి గెలిచిన గిడ్డి సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నారు.
పి గన్నవరం నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్‌ను నియమించిన టీడీపీ.. ముందు రోజే బ్రేక్ తీసుకుంటున్నానంటూ మహాసేన రాజేష్ పోస్ట్
RELATED ARTICLES


