HomeNation and Worldనేపాల్ రెస్క్యూ మిరాకిల్.. మూడ్రోజులు మట్టి దిబ్బల కింద నలిగినా సజీవంగా బయటపడ్డ ఆరేళ్ల చిన్నారి!

నేపాల్ రెస్క్యూ మిరాకిల్.. మూడ్రోజులు మట్టి దిబ్బల కింద నలిగినా సజీవంగా బయటపడ్డ ఆరేళ్ల చిన్నారి!

నేపాల్‌ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు ఆ దేశంలో ఎంతటి విషాదాన్ని నింపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటికీ బాధితులు తమ వాళ్లను కోల్పోయి ఏడుస్తుండగా.. ఓ మిరాకిల్ జరిగింది. ముఖ్యంగా రసువా జిల్లాలోని తిమురే గ్రామంలో భోటే కోషి నది సృష్టించిన బీభత్సానికి దట్టమైన మట్టి, శిథిలాల కింద ఏకంగా మూడు రోజుల పాటు చిక్కుకుపోయిన ఆరేళ్ల చిన్నారి మనీషా మగర్‌ను ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది సజీవంగా వెలికితీశారు. ఆమె ఏడుపు విని అప్రమత్తమైన రెస్క్యూ టీమ్.. చిన్నారిని కాపాడి హెలికాప్టర్ ద్వారా అత్యవసర వైద్యం కోసం కాఠ్మాండు ఆసుపత్రికి తరలించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments