విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ ఎట్టకేలకు అక్టోబర్ 30నే విడుదలవుతుందని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. ‘జైలర్ 2’ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. “ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది కాబట్టి ఈసారి నేనే మళ్లీ డేట్ చెబితే జనాలు నమ్మరు, తంతారు కూడా. అందుకే ప్రస్తుతం ఊటీ షూటింగ్లో ఉన్న వెంకటేష్ గారితోనే అక్టోబర్ 21 లేదా 22న జరిగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటింపజేస్తాం” అని చమత్కరించారు. కాగా, అదే తేదీకి నాగార్జున సమర్పణలోని ‘ఇట్లు అర్జున’ కూడా షెడ్యూల్ అయి ఉండటంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొంది.
‘నేను చెబితే జనాలు తన్నుతారు.. వెంకటేష్ గారే చెబుతారు’.. ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్పై నాగవంశీ
RELATED ARTICLES


