HomeHeadlinesనిందితుల టార్గెట్ లిస్టులో.. సల్మాన్ ఖాన్ తర్వాత అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్‌లేనట!

నిందితుల టార్గెట్ లిస్టులో.. సల్మాన్ ఖాన్ తర్వాత అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్‌లేనట!

బాలీవుడ్ యువ నటుడు టైగర్ ష్రాఫ్ కారు లక్ష్యంగా జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో అత్యంత విస్మయకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి ఈ దాడికి ప్రధాన లక్ష్యం కండల వీరుడు సల్మాన్ ఖాన్ అని, అయితే ఆయన నివాసం వద్ద ఉన్న పటిష్టమైన భద్రతా వలయాన్ని చూసి వెనక్కి తగ్గిన దుండగులు.. అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖుల ఇళ్ల వద్ద కూడా రెక్కీ నిర్వహించినట్లు తేలింది. చివరకు సల్మాన్ భద్రతను దాటడం కష్టమని భావించి.. సులభంగా దొరుకుతాడనే ఉద్దేశంతోనే టైగర్ ష్రాఫ్‌ను టార్గెట్ చేసినట్లు నిందితులు విచారణలో అంగీకరించడం బాలీవుడ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments