HomeTELANGANAదసరా, దీపావళి పండగల వేళ వంటింటిపై ధరల పిడుగు.. ఆకాశాన్నంటిన బియ్యం, చక్కెర సహా నిత్యావసరాలు

దసరా, దీపావళి పండగల వేళ వంటింటిపై ధరల పిడుగు.. ఆకాశాన్నంటిన బియ్యం, చక్కెర సహా నిత్యావసరాలు

నిత్యావసరాల ధరల పెరుగుదల కుటుంబాల నెలవారీ ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. బియ్యం, చక్కెర సహా నిత్యావసరాల ధరలు పెరగడంతో వంటింట్లో ధరల పిడుగు పడింది. ఇక దసరా, దీపావళి పండగల వేళ.. నిత్యావసరాల ధరలు పెరగడంతో సామాన్యులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వర్షాలు లేకపోవడం, ఎల్‌నినో ప్రభావంపై ఆందోళనలు వ్యవసాయ ఉత్పత్తి, మార్కెట్ సరఫరాపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో ధరలు ఎలా మారతాయన్నది పంటల రాక, మార్కెట్లో నిత్యావసరాల సరఫరా, పండుగల డిమాండ్‌పై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments