HomeAndhra Pradeshతిరుపతికి మరో వందేభారత్ రైలు.! ఎంపీ విజ్ఞప్తికి రైల్వేశాఖ సానుకూల స్పందన..

తిరుపతికి మరో వందేభారత్ రైలు.! ఎంపీ విజ్ఞప్తికి రైల్వేశాఖ సానుకూల స్పందన..

ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతికి మరో వందేభారత్ రైలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలోని శివమొగ్గ టౌన్‌, తిరుపతి మధ్య కొత్త వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రవేశపెట్టేందుకు రైల్వే బోర్డు ప్రతిపాదన రూపొందించింది. ఈ విషయాన్ని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి వెల్లడించారు. ఈ విషయంపై తాను రాసిన లేఖకు రైల్వేశాఖ నుంచి స్పందన వచ్చిందని.. ఈ మార్గంలో వందేభారత్ రైలు నడపాలనే ప్రతిపాదన రూపొందించినట్లు రైల్వే బోర్డు నుంచి సమాచారం వచ్చిందని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments