ట్రైన్ ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అలర్ట్ జారీ చేసింది. కాజీపేట–బల్లార్ష మార్గంలోని జమ్మికుంట–పోత్కపల్లి మధ్య 17 కిలోమీటర్ల మేర ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుకు నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కారణంగా ఈ నెల 10న రామగిరి మెమూ ఎక్స్ప్రెస్ పూర్తిగా రద్దవుతుంది. సింగరేణి ఎక్స్ప్రెస్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ సర్వీసులు పాక్షికంగా నడుస్తాయి. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ గంట ఆలస్యంగా బయలుదేరుతుంది. మరికొన్ని దూరప్రాంత రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి.


