గుండె సంబంధిత వ్యాధుల ముప్పు రోజు రోజుకీ పెరుగుతుంది. దీనికి బిజీ లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లు, పొల్యూషన్ కారణాలు. చాలా మంది హార్ట్ ఎటాక్ని మాత్రమే సీరియస్‌గా తీసుకుంటారు. అయితే, గుండెకి సంబంధించిన ఎన్నో వ్యాధులతో ముప్పు ఉంది. అలాంటి వ్యాధుల్లో పెరికార్డిటిస్ ఒకటి. మన గుండె చుట్టూ రక్షణ కవచంలా ఉండే రెండు పొరల సన్నని సంచిని ‘పెరికార్డియం’ అంటారు. సాధారణంగా ఈ రెండు పొరల మధ్య కొద్దిపాటి ద్రవం ఉంటుంది. ఇది గుండె కొట్టుకునే సమయంలో పొరలు రాపిడికి గురికాకుండా సులభంగా కదలడానికి సాయపడుతుంది.
పెరికార్డియం వాపునకు లేదా ఇన్ఫ్లమేషన్కు గురైనప్పుడు, ఆ రెండు పొరలు ఒకదానితో ఒకటి రాసుకుని తీవ్రమైన ఛాతీ నొప్పి వస్తుంది. దీనినే పెరికార్డిటిస్ అంటారు. కొన్నిసార్లు ఈ వాపు వల్ల గుండె చుట్టూ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ద్రవం పేరుకుపోతుంది. పెరికార్డిటిస్కి కారణాలు, ముఖ్య లక్షణాలు, వ్యాధి నిర్థారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ పవన్ పోద్దార్ (డైరెక్టర్ – క్యాత్ ల్యాబ్ & సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్) అందించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


