Amaravati Gannavaram Mega Railway Terminals Update: ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలో కొత్తగా రెండు మెగా రైల్ టెర్మినల్స్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. గన్నవరంతో పాటుగా అమరావతిలో రెండు మెగా టెర్మినల్స్‌కు సంబంధించి డీపీఆర్, వ్యయం, భూములకు సంబంధించి కసరత్తు చేస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో మూడు రైల్వే లైన్లను విస్తరించనున్నారు. రైల్వే అధికారులు గన్నవరం, అమరావతి టెర్మినల్స్‌కు సంబంధించి భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే డీపీఆర్ రెడీ చేసి పంపించేందుకు సిద్ధమయ్యారు.


