Nagababu MLC Post: జనసేన నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా నియమించిన ప్రభుత్వం ఆయనకు కేబినెట్ హోదా కల్పించింది. ఆయనకు అందే జీతభత్యాలు, అలవెన్సులకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ చట్టసభల్లో సభ్యులుగా ఉన్నవారు లాభదాయక పదవుల్లో ఉండకూడదనే నిబంధన ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ మేరకు రాజ్యాంగ నిబంధన (ఆర్టికల్ 191(1)) ఇబ్బందిగా మారే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.


