పిల్లల ఆరోగ్యంలో ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. హెల్తీ ఫుడ్స్ కారణంగా పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదుగుతారు. ఇక, మనం ఆరోగ్యకరమైన ఆహారం గురించి ఆలోచించేటప్పుడు సాధారణంగా కేలరీలపైనే ఎక్కువ దృష్టి పెడతాం. కానీ మంచి పోషకాహారం అంటే కేవలం కేలరీలు లెక్కపెట్టడం మాత్రమే కాదు. శరీరం సరిగ్గా ఎదగడానికి, మరమ్మత్తు కావడానికి అవసరమైన సరైన పోషకాలు అందుతున్నాయా లేదా అనేది ముఖ్యం. వీటిలో ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, కాబోయే తల్లులకు ప్రొటీన్ అత్యంత కీలకమైన పోషకం.
ప్రొటీన్‌ను శరీర నిర్మాణానికి మూలస్తంభం (Building Block) అంటారు. ఇది కండరాలు, ఎముకలు, చర్మం, హార్మోన్లు, ఎంజైమ్‌లు, ఇమ్యూనిటీని పెంచే యాంటీబాడీలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. పిల్లల ఎదుగుదల సమయంలో, అలాగే గర్భధారణ సమయంలో శరీరానికి ప్రొటీన్ అవసరం సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ ఎందుకు అవసరం, ఎలాంటి ఫుడ్స్‌లో లభిస్తుందన్న పూర్తి వివరాల్ని డాక్టర్ బత్తుల ఐశ్వర్య (సీనియర్ హెల్త్ కోచ్ & క్లినికల్ న్యూట్రిషనిస్ట్, అంకుర హాస్పిటల్ ఫర్ ఉమెన్ & చిల్డ్రన్, మదీనా గూడ) అందించారు.


