ఏపీలో వైద్యారోగ్య రంగానికి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.249 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలను కేంద్రమంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 500 క్రిటికల్ కేర్ బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో సంజీవని ప్రాజెక్టును ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు.


