Andhra Pradesh Medical PG Students 24 Hours Duty: ఏపీ పీజీ మెడికల్ విద్యార్థులతో వరుసగా 24 గంటలకు మించి డ్యూటీ చేయించవద్దని ఆదేశాలు వచ్చాయి. అంతేకాదు వారానికి 74 గంటలకు మించి విధులు కేటాయించొద్దని డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ ఆదేశించారు. ప్రతి వారం ఒకరోజు సెలవు కచ్చితంగా ఇవ్వాలన్నారు. ఈ మేరకు డీఎంఈ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. పీజీ విద్యార్థులకు విధులు, డ్యూటీ రోస్టర్లు, సెలవులకు సంబంధించి ఉత్తర్వుల పాటించాలన్నారు.
ఏపీలో పీజీ మెడికల్ విద్యార్థులకు వారానికి ఒకరోజు సెలవు.. 24 గంటలకు మించి డ్యూటీ ఉండదు.. ప్రభుత్వం కీలక నిర్ణయాలు
RELATED ARTICLES


