2009 ఏప్రిల్ నుంచి 2026 మార్చి మధ్య ఈపీఎఫ్ పరిధిలోకి రాకుండా మిగిలిపోయిన అర్హులైన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ‘ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ 2026’ కింద ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు పీఎఫ్ ఖాతా తెరిచే వెసులుబాటును ఈపీఎఫ్ఓ కల్పించింది.


