Mercury Transit in Virgo: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి నెలా గ్రహాలు తమ స్థానాలను మారుతూ ఉంటాయి. దీన్నే రాశి పరివర్తనం అని అంటారు. ఈ నేపథ్యంలో బుధుడు సెప్టెంబర్ 07వ తేదీన అంటే సోమవారం మధ్యాహ్నం సుమారు 1:35 గంటలకు సింహ రాశి నుంచి తన సొంత రాశి అయిన కన్య రాశిలోకి సుదీర్ఘ కాలం తర్వాత ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో దాదాపు 20 రోజుల పాటు అంటే సెప్టెంబర్ 26వ తేదీ వరకు సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో భద్ర రాజయోగం, సూర్యుడితో కలిసి బుధాదిత్య యోగాలను ఏర్పరచనున్నాడు. ఈ శుభ యోగాల ప్రభావంతో మేషం, కర్కాటకం సహా కొన్ని రాశుల వారికి కెరీర్ పరంగా మంచి పురోగతి లభించనుంది. ఆర్థిక పరంగా ఊహించని లాభాలు రానున్నాయి. ఈ సందర్భంగా బుధుడి సంచారంతో ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సెప్టెంబర్ 7న కన్యరాశిలో బుధుడి సంచారం: భద్ర రాజయోగం ప్రభావంతో మేషం సహా ఈ 4 రాశులకు గోల్డెన్ టైమ్!
RELATED ARTICLES


