సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోన్న సీజేపీ.. దేశ రాజధానిలో శనివారం భారీ నిరసనకు పిలుపునివ్వడంతో కేంద్రం అప్రమత్తమైంది. భారీ ఎత్తున బలగాలను మోహరించడమే కాదు.. మెట్రో, రైలు సర్వీసులను కూడా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అక్టోబరు 9 అర్థరాత్రి నుంచి 57 మెట్రో స్టేషన్లు మూసివేయనున్నారు. ఈ చర్యలపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. సామాన్యులకు ఇబ్బంది లేకుండా ఉండాలని, పూర్తి మూసివేయడం తగదని తేల్చిచెప్పింది.


