వాతావరణం మారుతున్న కొద్దీ వైరల్ జ్వరాలు, జలుబు, దగ్గు కేసులు పెరుగుతున్నాయి. ఈ సమయంలో మనం తప్పక అప్రమత్తంగా ఉండాల్సిన ఒక ముఖ్యమైన వైరస్ హెచ్1ఎన్1 (H1N1), దీనినే మనం సాధారణంగా ‘స్వైన్ ఫ్లూ’ అని పిలుస్తాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇక, పిల్లల్లో రోగనిరోధక శక్తి ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం, వారి శ్వాసనాళాలు చిన్నవిగా ఉండటం వల్ల పెద్దల కంటే వారే ఈ వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువ.
చాలామంది పిల్లల్లో విశ్రాంతి, తగినన్ని ద్రవ పదార్థాలు (మంచి నీరు/ఓఆర్ఎస్), వైద్యుల సలహా మేరకు వాడే మందులతో హెచ్1ఎన్1 నయమవుతుంది. కానీ కొంతమంది పిల్లల్లో పరిస్థితి చాలా వేగంగా విషమించవచ్చు. అందుకే ప్రమాద సంకేతాలను ముందుగానే గుర్తించడం ప్రాణాలను కాపాడుతుంది. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడని సంకేతాలేంటి, వెంటనే ఆసుపత్రికి ఎప్పుడు తీసుకెళ్లాలి అన్న పూర్తి వివరాల్ని డాక్టర్ వంశీ వి, (కన్సల్టెంట్ – ఇంటర్నల్ మెడిసిన్, గ్లెనీగల్స్ అవేర్ హాస్పిటల్ (ఎ ఫోర్టిస్ హెల్త్‌కేర్ నెట్వర్క్ హాస్పిటల్), ఎల్.బి. నగర్, హైదరాబాద్.) అందించారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.


