HomeTELANGANAహైదరాబాద్ ఫ్యూచర్‌ సిటీకి మరో రహదారి.. తుది దశకు 11.8 కి.మీ. మార్గం

హైదరాబాద్ ఫ్యూచర్‌ సిటీకి మరో రహదారి.. తుది దశకు 11.8 కి.మీ. మార్గం

నాగార్జున సాగర్ రోడ్డు నుంచి ఫ్యూచర్ సిటీకీ అనుసంధానించే 11.8 కి.మీ రహదారి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. తక్కళ్లపల్లి, మేడిపల్లి గ్రామాల పరిధిలో ఇప్పటికే ఉన్న 6 కి.మీ రహదారిని రెండు లైన్లుగా విస్తరించగా.. మరో 5.8 కి.మీ మేర టీజీఐఐసీ సేకరించిన భూముల్లో కొత్త రోడ్డును నిర్మిస్తున్నారు. మెుత్తం 7 మీటర్ల వెడల్పుతో భారీ వాహనాలకు అనుకుూలంగా ఈ రోడ్డును తీర్చిదిద్దుతున్నారు. ప్రాజెక్టుకు రూ.30 కోట్లు కేటాయించారు. రానున్న వారం రోజుల్లోనే ఈ ప్రాజెక్టు పనులు పూర్తయ్యే ఛాన్సుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments