HomeAndhra Pradeshసరకు రవాణాలో ఏపీ రికార్డ్... దేశంలోనే రెండో స్థానం ... నాన్ మేజర్ పోర్టుల్లో...

సరకు రవాణాలో ఏపీ రికార్డ్… దేశంలోనే రెండో స్థానం … నాన్ మేజర్ పోర్టుల్లో గుజరాత్‌ను దాటేస్తుందా?

ఏపీ పోర్టులు 210 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల (MMT) సరకు రవాణాతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచాయి. నౌకల టర్న్‌ ఎరౌండ్‌ సమయం తగ్గించడం, వసతులు మెరుగుపడటంతో గత ఏడాదితో పోలిస్తే సరకు రవాణాలో 12 శాతం పెరుగుదల నమోదైంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ పోర్టులు పూర్తైతే మరో 109 ఎంఎంటీల సామర్థ్యం అదనంగా అందుబాటులోకి వస్తుంది. ఈ లక్ష్యాలు నెరవేరితే నాన్-మేజర్ పోర్టుల సరకు రవాణాలో మొదటి స్థానంలో ఉన్న గుజరాత్‌ను ఆంధ్రప్రదేశ్‌ త్వరలోనే దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments