నాగుపాము (Cobra) పేరు వింటేనే ఎంత ధైర్యవంతులకైనా ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టడం సహజం. మన దైనందిన జీవితంలో లేదా ప్రయాణాల్లో అనుకోకుండా పాము ఎదురైనప్పుడు చాలా మంది భయాందోళనకు గురై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అయితే సాధారణంగా పాములు మనషులపై దాడి చేయడానికి ఇష్టపడవు. తమకు ప్రమాదం ఉందని భావించినప్పుడు మాత్రమే ఆత్మరక్షణ కోసం తిరగబడతాయి. కోబ్రా ఎదురైనప్పుడు మనం ప్రదర్శించే వివేకం, ఓపిక, సరైన సమయస్ఫూర్తి మన ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉంటూ ఎలాంటి అనవసరమైన, తొందరపాటు చర్యలకు దిగకుండా సురక్షితంగా బయటపడటం ఎలాగో తెలుసుకోవడం చాలా అవసరం. ఈ ప్రకృతిలో జీవించే హక్కు ప్రతి ప్రాణికి ఉన్నట్లే పాములకు కూడా పర్యావరణ వ్యవస్థలో తమదైన ప్రాముఖ్యత ఉంది. అందుకే వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడే చిట్కాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..


