దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాలం వస్తుందటే జనం భయపడిపోతారు. గాలిలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుని గ్యాస్ చాంబర్‌ను తలపిస్తుంది. నియంత్రణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకున్నా.. ప్రయోజనం మాత్రం శూన్యం. అయితే, ఈ ఏడాది మూడు నెలల ముందే ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కాలుష్య నియంత్రణకు మార్గదర్శకాలను వెలువరించింది.


