హిందూ మతాన్ని కించపరిచే చర్యలు, హిందూ సంప్రదాయాలకు భంగం కలిగించే పనులను అడ్డుకుంటానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాధిక్ ఖాన్ అంశంపై రాష్ట్ర బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. టీడీపీ, వైసీపీ వైఖరిపైనా విమర్శలు గుప్పించారు. పాలన చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు.. అసమర్థ ప్రతిపక్ష నేత జగన్ అంటూ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో మూడింట రెండు వంతులకుపైగా మెగా మెజారిటీ ఉన్న చంద్రబాబు.. మతమార్పిడుల నిరోధక బిల్లు ఎందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు.
వైఎస్ జగన్ అసమర్థ ప్రతిపక్ష నేత.. విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు..
RELATED ARTICLES


