Vijayawada Temple Dasara Darshan Details: విజయవాడ దుర్గ గుడిలో ఈసారి దసరా ఉత్సవాల సమయంలో భక్తుల దర్శనాలపై ఆలయ అధికారులు ఫోకస్ పెట్టారు. దసరా సమయంలో ‘భవానీ ప్రత్యేక దర్శనం’ పేరుతో టికెట్లు జారీ చేసి.. ఒక ప్రత్యేక క్యూలైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. సామాన్య భక్తులందరికి ఉచితంగా దర్శనం కల్పిస్తారు. ఐదు లైన్లలో సాధారణ భక్తుల్ని దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. ఈ భవానీ ప్రత్యేక దర్శన టికెట్లను ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు, అధికారిక సిఫార్సులపై వచ్చేవారికి మాత్రమే కేటాయిస్తారు.
విజయవాడ: దసరాకు దుర్గమ్మ దర్శనం అందరికీ ఉచిత దర్శనం.. ఆ దర్శన టికెట్లన్నీరద్దు, వారికి మాత్రం స్పెషల్ టికెట్లు
RELATED ARTICLES


