ఈ రోజుల్లో చాలా మంది మహిళలు క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. అందులో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతున్నారు. అందుకే మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది అక్టోబర్ నెలను రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా (Pink October) నిర్వహిస్తున్నారు. అయితే, బ్రెస్ట్ క్యాన్సర్‌కు మొదటి లక్షణం రొమ్ములో గడ్డ అని చాలా మంది అనుకుంటారు. కానీ రొమ్ము క్యాన్సర్ ఎల్లప్పుడూ ఒక గడ్డ (Lump) రూపంలోనే ప్రారంభం కావాలనే నియమం లేదు. చేతికి ఎలాంటి గడ్డ తగలకుండానే, రొమ్ము పైభాగంలో కొన్ని కనిపించే మార్పులు చోటుచేసుకోవచ్చు. నొప్పి లేనంత మాత్రాన ఇలాంటి మార్పులను తేలికగా తీసుకోకూడదు. మహిళలు బాడీలో గమనించాల్సిన ప్రధాన మార్పులు, రొమ్ము క్యాన్సర్‌పై పూర్తి అవగాహన గురించి డాక్టర్ అశ్విన్ కె. ఆర్ (హెచ్‌ఓడీ అండ్ కన్సల్టెంట్ – సర్జికల్ ఆంకాలజీ అండ్ గైనకాలజికల్ ఆంకాలజీ, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్) పూర్తి వివరాల్ని అందించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


