
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరలకు సరుకులు అందించనుంది.కిలో కందిపప్పు రూ.100, లీటర్ పామాయిల్ రూ.125 చొప్పున మొత్తం రూ.225కే అందుబాటులోకి తీసుకురానున్నారు. డిసెంబర్ నుంచి పంపిణీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించినట్లు సమాచారం.


