ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథ అందిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RAPO23’ నుంచి అధికారిక అప్డేట్ వెలువడింది. ఈ చిత్రంలో కీలకమైన ప్రతినాయక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను ఎంపిక చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న తాజా షెడ్యూల్లో ఆయన అడుగుపెట్టగా రామ్ స్వయంగా స్వాగతం పలికారు. జెనీలియాతో రామ్‌కు ఉన్న చిరకాల స్నేహ బంధంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు రితేష్ ఓకే చెప్పారు. ‘ది లోన్ వోల్ఫ్’ కాన్సెప్ట్‌తో నియో-నోయర్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాతో రితేష్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి.
రామ్ పోతినేనికి విలన్‌గా జెనీలియా భర్త… ‘RAPO23’లోకి రితేష్ దేశ్‌ముఖ్ గ్రాండ్ ఎంట్రీ
RELATED ARTICLES


